in

Here’s Why Sai Pallavi Got Emotional At ‘SSR’s Pre-Release Event!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ.. ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ తర్వాత నానితో చేస్తున్న సినిమా ఇది. అందులో రియల్‌‌ లైఫ్‌‌లో ఎలా ఉంటానో అలాగే కనిపించాను. కానీ ఈ మూవీలో మా క్యారెక్టర్స్ డిఫరెంట్‌‌. లవ్‌‌ సీన్స్ డీప్‌‌గా ఉంటాయి. సినిమాలో లాస్ట్ సీన్‌‌ని మొదటే షూట్ చేసేశారు. దాంతో ఎలా చేయాలో తెలియలేదు. దర్శకుడు చెప్పింది ఫాలో అయ్యామంతే. స్కూల్‌‌లో దేవదాసీ వ్యవస్థ గురించి కొంత చదువుకున్నాం. ఈ సినిమాలో వాళ్ల సైకాలజీ గురించి చర్చించడం నచ్చింది.

మొదట్లో వాళ్లు దైవ సేవకులు. తర్వాత ఆ పద్ధతి మారింది. ఇదేమీ దేవదాసీ వ్యవస్థపై తీసిన సినిమా కాదు. శ్యామ్ సింగ రాయ్ పాత్రే కీలకం. తనతో పాటు దేవదాసీల గురించి ఎంత చూపించాలో అంతే చూపించారు. స్క్రిప్ట్ చదివేటప్పుడే కాన్సెప్ట్‌‌ ఎలా ఉంటుంది, మన క్యారెక్టర్ ఎలా చేయొచ్చు అని ఓ ఐడియా వచ్చేస్తుంది నాకు. పాత్రకి కనెక్ట్ అయితేనే నటన బాగుంటుంది. లేదంటే డిఫరెన్స్ తెలిసిపోతుంది. ఇందులోని పాత్రలో నేను కాకుండా దేవదాసీనే కనిపిస్తుంది. ఏ పాత్రయినా చేసేటప్పుడు నా నుంచి ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు.

ఎందుకంటే ఏ సినిమాకైనా స్క్రిప్ట్ చదివే కదా సైన్ చేస్తాం నేను నటిస్తే ఆ కథ, క్యారెక్టర్‌‌‌‌పై అంచనాలు పెరుగుతున్నాయని ఎవరైనా చెబితే భయమేస్తుంది. . ‘ఎంసీఏ’ టీమ్‌‌లో కొందరు పల్లవి అన్‌‌కంఫర్టబుల్‌‌గా ఫీలయ్యిందన్నారు. రెగ్యులర్ క్యారెక్టర్ ఒకటి చేసి చూద్దామని ఆ సినిమా చేశా. కానీ చేసేటప్పుడే నాకూ అర్థమైంది.. అలాంటి పాత్రల్లో నేను కంఫర్టబుల్ కాదని. నా బ్రెయిన్ లో నేను మామూలు సాయిపల్లవినే. కాకపోతే నేను చేసే పని ఎంతోమందికి సంతోషాన్నిస్తోందని తెలిసి ప్రీ రిలీజ్‌‌ ఈవెంట్‌‌లో కొంత ఎమోషనల్ అయ్యాను. అది నా గ్రాటిట్యూడ్..”

actress tabu gives a warning to bollywood hero Karthik Aryan!

kriti sanon walks for river island at lakme fashion week!