in

happy birthday Naga Shaurya!

నాగశౌర్య 1989 జనవరి 22న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించాడు. విజయవాడలో నాగశౌర్య బాల్యం గడిచింది. అప్పటి నుంచీ సినిమాలు అతణ్ణి ఆకర్షిస్తూనే ఉన్నాయి. టెన్నిస్ లో మంచి ప్రావీణ్యం ఉంది. మిత్రులు ఎప్పుడూ హీరోలా ఉన్నావ్ అంటూ ఉండేవారు. దాంతో సినిమాల్లో ట్రై చేయాలని భావించాడు నాగశౌర్య. నాగశౌర్య కన్నవారికి కూడా అది తెలుసు కాబట్టే, నాగశౌర్యను ప్రోత్సహించారు. ‘క్రికెట్, గర్ల్స్ అండ్ బీర్’ తో తెరపై తొలిసారి కనిపించిన నాగశౌర్య ఆపై ఒక్కో మెట్టు ఎక్కుతూ ముందుకు సాగాడు.‘చందమామ కథలు’లో రాజుగా పలకరించాడు…

‘ఊహలు గుసగుసలాడే’లో వెంకీగా అలరించాడు. ‘దిక్కులు చూడకు రామయ్యా’ అని హెచ్చరిస్తే, ‘లక్ష్మీ రావే మా ఇంటికి’ అంటూ అవికా గోర్ ను ఆహ్వానించాడు. ఇలా సాగుతున్న నాగశౌర్య ‘జాదూగాడు’గానూ మురిపించాడు. ఆ తరువాత ‘కళ్యాణ వైభోగమే’ అంటూ పాట పాడాడు. నాగశౌర్య కన్నవారే తమ ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై ‘ఛలో’ సినిమా తీసి జనానికి అతణ్ణి మరింత చేరువ చేశారు. “నర్తనశాల, అశ్వథ్థామ” చిత్రాలు కూడా ఐరా బ్యానర్ పైనే తెరకెక్కి, నాగశౌర్య అభినయం చూసి ఔరా అనేలా చేశాయి. అయితే నాగశౌర్య ఆశిస్తున్న భారీ విజయం ఇప్పటి దాకా అతని దరి చేరలేదు.

అయినా పట్టువదలని విక్రమార్కునిలా ప్రయత్నాలు సాగిస్తూనే ఉన్నాడు. గత సంవత్సరం నాగశౌర్య నటించిన ‘వరుడు కావలెను’ ఫరవాలేదనిపించింది. ‘లక్ష్య’తో తన లక్ష్యం నెరవేర్చుకోవడానికి ఎంతగానో తపించాడు నాగశౌర్య. కానీ, ఫలితం దక్కలేదు. ప్రస్తుతం “ఫలానా అబ్బాయి – ఫలానా అమ్మాయి, నారీ నారీ నడుమ మురారి, పోలీస్ వారి హెచ్చరిక” చిత్రాలతో పాటు అనిష్ కృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు నాగశౌర్య. ఏది ఏమైనా ఏదో ఒకరోజు నాగశౌర్య కృషి ఫలిస్తుందని సినీ ఫ్యాన్స్ అంటున్నారు. మరి అది ఈ యేడాదే సాకారం అవుతుందేమో చూద్దాం.

person behind deepfake video of Rashmika arrested!

happy birthday namratha!