in

happy birthday jr ntr!

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు పండుగ రోజు. ఎప్పుడెప్పుడా అనే ఎదురుచూపులు, సంబరాలకు వేదిక. ఎన్టీఆర్ ఇంటి వద్ద పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పేవారు కొందరు.. తమ ప్రాంతాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టే అభిమానులు మరికొందరు.. సోషల్ మీడియా వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపేవారు ఇంకొందరు. తెలుగులో సగటు అభిమాని తమ ఫేవరేట్ హీరోని అభిమానించే స్థాయి ఇదే. ఈసారి కొత్తగా తమ హీరోకి ఆర్ఆర్ఆర్ ద్వారా దక్కిన ఇంటర్నేషనల్ రికగ్నిషన్ ఆనందం ఓవైపు.. సింహాద్రీ రీ-రిలీజ్ మేనియా మరోవైపు.. ఎన్టీఆర్30 సినిమా కొత్త పోస్టర్ విడుదల, బాలీవుడ్ ప్రాజెక్ట్ లో భాగమవుతున్నసందర్భంగా సంతోషం మరోవైపు.. ఇన్ని కార్నర్స్ తో ఈ ఏడాది మే 20ని సరికొత్తగా జరుపుకుంటున్నారు ఎన్టీఆర్ అభిమానులు. నేడు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు.

దేశీయ సినీ ప్రముఖులతోపాటు హాలీవుడ్ ప్రముఖులూ ఎన్టీఆర్ పై దృష్టి సారించారు. ప్రముఖ బాలీవుడ్ సంస్థ యశ్ రాజ్ ఫిలింస్ తమ వార్ సిరీస్ మూవీలో ఒక హీరోగా ఎన్టీఆర్ ను ఎంపిక చేసుకోవడమే ఇందుకు నిదర్శనం. దీంతో తన నట పరాక్రమాన్ని మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోనున్నారు. ఇప్పటికే ప్రశాంత్ నీల్ తో, కొరటాల శివతో పాన్ ఇండియా కంటెంట్ తో సినిమాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ ను అమెజాన్ స్టూడియోస్, ప్రైమ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫార్వెల్ కలవడం చర్చనీయాంశమైంది. ఇలా తన కష్టంతో తెచ్చుకున్న అంతర్జాతీయ కీర్తిని ఎన్టీఆర్ మరింత ఎత్తులకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు. రామాయణం సినిమాలో రాముడిగా కెరీర్ మొదలు పెట్టి..RRR భీముడుగా దుమ్ము దులిపి..ఇప్పుడు దేవర గ మన ముందుకు వస్తున్న ఎన్టీఆర్ మరిన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని, ఇదే రీతిన భవిష్యత్తులో మరిన్నివిజయాలు సాధించాలని కోరుకుంటూ.. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తున్నాము..!!

happy birthday Sirivennela Sitaramasastri!

Keerthy Suresh to marry Dubai-based realtor?