తాను హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకున్నట్లు వస్తున్న రూమర్స్ పూర్తిగా అవాస్తవమని హన్సిక వెల్లడించింది. ఈ రూమర్‌లు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని, తీవ్ర ఒత్తిడికి గురిచేశాయని హన్సిక పేర్కొంది. అయితే..ఈ నిరాధారమైన రూమర్లను పట్టించుకోవడం ఇష్టం లేకనే అప్పటికప్పుడు మౌనంగా ఉండటాన్ని ఎంచుకున్నానని చెప్పింది. హన్సిక మాట్లాడుతూ, ‘నేను సెలబ్రిటీగా ఉన్నందుకు చాలా విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. నేను అప్పుడు హార్మోన్ ఇంజెక్షన్లు తీసుకున్నట్లయితే, నేను వాటిని ఈ రోజు తీసుకుంటాను.
ఆ ఇంజెక్షన్లు మా అమ్మ వేసేశారని ప్రచారం జరిగింది.’ ఆ రాతలు, పుకార్లన్నింటినీ కొట్టిపారేసిన హన్సిక తల్లి కూడా ‘నాకు ఆ ఇంజెక్షన్లు వేయాలంటే మనం టాటాలు, బిర్లాల కంటే ధనవంతులం కావాలి. నేను మిలియనీర్ అయి ఉండాలి. ఈ రూమర్స్ ఎలా వస్తాయో నాకు తెలియదు. ప్రజలకు ఇంగితజ్ఞానం లేదు. మేము పంజాబీలము. మా అమ్మాయిలు 12 నుంచి 16 ఏళ్ల మధ్య వేగంగా ఎదుగుతారు.’ హన్సిక తన కెరీర్‌లో, వ్యక్తిగత జీవితంలో తనపై వచ్చిన రూమర్‌లన్నింటినీ పరిష్కరించాలని నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది..!!