టాలీవుడ్ లో యెన్.టి.ఆర్. ఏ.యెన్.ఆర్ ఎప్పటికి చరిత్రలో నిలిచి పొయెటువంటి గొప్ప నటులు.వీరిద్దరూ ఎంతో మంది హీరోయిన్స్ తో కలసి నటించారు, వీరితో పోటీ గ నంటించటం ఒక అనుభూతిగా ఫీల్ అయ్యే వారు హీరోయిన్స్. యెన్.టి.ఆర్. సెట్ లో చాల గంభీరంగా తన పనేదో తాను చూసుకొంటూ ఉండటం వలన సెట్ లో వాతావరణం కూడా కొంత సీరియస్ గానే ఉండేది. అక్కినేని గారు మాత్రం అందరి తో సరదాగా ఉంటూ సందడి చేస్తూ, హీరోయిన్స్ మీద జోక్స్ కట్ చేస్తూ, వాతావరణాన్ని ఆహ్లాదంగా ఉంచే వారు. సహా నటులు కు సహకరించటం లో మాత్రం ఇద్దరు ఇద్దరే, సొంత వాళ్ళ లాగా వారిని చూసుకునే వారు. అక్కినేని గారి కెరీర్ లో ఎంతో మంది హీరోయిన్స్ తో నటించారు..
అందరితో సరదాగా ఉండే అక్కినేని గారు ఆ హీరోయిన్ తో కల్సి నటించేటప్పుడు మాత్రం కాస్త అలెర్ట్ గ ఉండే వారట. ఆమె ఎవరో కాదు సహజ నటి జయసుధ గారు,ఏదో సందర్భం లో నటుడు మురళి మోహన్ తో పిచ్చాపాటి మాట్లాడుతున్న అక్కినేని గారు, మురళి! ఈ పిల్ల జయసుధ షాట్ లో ఉంటె నేను కొంచెం అలెర్ట్ గ ఉండేవాడిని, ఎందుకంటె, జయసుధ పైన సింగల్ షాట్స్ తీస్తున్నప్పుడు ఆమె ఎక్స్ప్రెషన్స్ ఎలా ఇస్తుందో మనం గమనించకపోతే , నెక్స్ట్ తీసే కామన్ షాట్స్ లో మనం వీక్ అయిపోతాం, అందుకే నేను ఆమెను గమనిస్తూ ఉండే వాడిని అన్నారట. జయసుధ సెట్లో ఉంటె మనం కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఆమెను గమనించటం ఉత్తమం, ఆమె ఏ సీన్ లో అయినా బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇస్తుంది, ఇప్పుడున్న వాళ్లలో జయసుధ ఒక మంచి నటి అని చెప్పేవారట. గ్రేట్ కాంప్లిమెంట్ టు జయసుధ గారు..!!