in

chaithu and sai pallavi ended their ‘love story’!

న టాలీవడ్ లో ఉన్న మంచి టాలెంటెడ్ అండ్ అండర్ రేటెడ్ దర్శకుల్లో శేఖర్ కమ్ముల కూడా ఒకరు. తాను తీసే సినిమాలు అంటే తెలుగు ఆడియెన్స్ ఎప్పుడూ ప్రత్యేకంగా ఎదురు చూస్తారు. అలా తాను తీసిన లాస్ట్ చిత్రం “ఫిదా”తో ఒక సాలిడ్ హిట్ అందుకున్నాకా తర్వాత ఎప్పటి లానే చాలా కాలం గ్యాప్ అనంతరం మొదలు పెట్టిన చిత్రం “లవ్ స్టోరీ”. మెచ్యూర్డ్ అండ్ టాలెంటెడ్ హీరో అక్కినేని నాగ చైతన్య హీరోగా ఒక్కసారిగా సెన్సేషన్ రేపిన నాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా ప్లాన్ చేసిన ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ మధ్య వచ్చిన చిన్న టీజర్ అండ్ పాటకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇక ఇదిలా ఉండగా గత సెప్టెంబర్ లో తిరిగి షూట్ ను ఆరంభించిన ఈ చిత్రం మొత్తానికి ఈరోజుతో షూటింగ్ ను పూర్తి చేసేసుకుంది. ఏ ఈవిషయాన్ని చిత్ర యూనిట్ రివీల్ చెయ్యడంతో దీనిపై క్లారిటీ వచ్చేసింది.

Gopichand in Pawan Kalyan ‘Ayyappanum Koshiyum’ remake?

RASHI KHANNA’S DESIRE TO ACT WITH THAT HERO!