దేవదాసు చిత్రంతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన బ్యూటీ ఇలియానా. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ సాధించిన ఇలియానా.. టాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోలందరి సరసన నటించింది. తరువాత బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. అక్కడ కొన్ని సినిమాలు చేసినప్పటికీ అంతగా రాణించలేక పోయింది. ఆ తర్వాత ప్రేమ పెళ్లి అంటూ సినిమాలను దూరం పెట్టింది. ఇక ఆ తర్వాత ఒళ్లు చేయడంతో ఇక సినిమాల్లోకి రావడం కష్టమే అని అందరూ అనుకుంటున్న సమయంలో మళ్లీ సన్నబడింది. సినిమాలకు రెడీ అంటూ సిగ్నల్ ఇచ్చింది.
ఈ నేపథ్యంలోనే అన్ ఫెయిర్ అండ్ లవ్లీ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రణదీప్ హుడా హీరోగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. బల్విందర్ సింగ్ జాంజువా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నవంబర్లో షూటింగ్ ప్రారంభించి వచ్చే ఏడాది విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఇక ప్రస్తుతం ఇలియానా అభిషేక్ బచ్చన్ సరసన బిగ్బుల్ చిత్రంలో నటిస్తోంది.