in

GAANAM LO MAADHURYAM, JEEVITHAMLO VISHADAM!

LR ఈశ్వరి గత కాలపు మధుర గాయని, ఆమె గళం విప్పితే ప్రేక్షకులు మత్తెక్కి పోయే వారు, ఆమె ఒరవడికి హుషారెక్కి ఊగిపోయేవారు. ఆమె గొంతులో ఒక మైకం, పలుకులో ఒక మత్తు ఉండేవి, ఆమె” లేలే నారాజా”,” మసక మసక చీకటిలో”, “భలే భలే మగాడివోయ్” అంటూ పాడిన పాటలు ఇంకా చెవుల్లో మారుమోగుతూనే ఉంటాయి. ఇంకా కొన్ని పల్లెటూరి తిరునాళ్లలో ” గుడి యెనక నా సామి గుర్రమెక్కి కూచున్నాడు” అనే పాట హోరెత్తిస్తూనే ఉంది. ఆమె పాటలో ఉన్న హుషారు ఆమె జీవితంలో కరువయ్యింది. ఆమె అసలు పేరు ల్యూర్త్ మేరీ రాజేశ్వరి, ఆమె పేరును ఎల్.ఆర్. ఈశ్వరి గ మార్చింది తమిళ దర్శకులు ఏ.పి.నాగరాజన్.చిన్న తనంలోనే తండ్రిని పోగొట్టుకున్న ఈశ్వరి, బ్రతుకు తెరువు కోసం బృందగానాల్లో కోరస్ పాడేది, ఆమె గొంతొలోని మాధుర్యాన్ని గుర్తించిన ప్రముఖ సంగీత దర్శకుడు ఏం.ఎస్.విశ్వనాథన్ ఆమెకు సోలో సింగర్ గ అవకాశం ఇచ్చారు.

అది ఆమె కెరీర్ కి పునాది వేస్తే, ఆమె జీవితంలో విషాదానికి కారణం అయ్యింది. గురుదక్షిణగా తన మనసును విశ్వనాథన్ గారికి అర్పించారు ఈశ్వరి, ఆయన తనను సాహచరిణిగా స్వీకరిస్తారు అనుకున్నది, కానీ సమాజానికి వెరసి ఆమెకు గౌరవమయిన స్థానాన్ని కల్పించలేక పోయారు విశ్వనాథన్ గారు. అందుకే ఆమె అవివాహితగానే మిగిలి పోయారు. ఆమె జీవితాన్ని కుటుంబానికి అంకితం చేసారు,తోడపుట్టిన వారి జీవితాలను, దగ్గరి బంధువుల జీవితాలను తీర్చి దిద్దటం తో తృప్తి పడ్డారు. మీరు ఇంకా పెళ్లి ఎందుకు చేసుకోలేదు అని హేళనగా అడిగితే, ” ఆరె ఏమిటి లోకం పలు గాకుల లోకం, మమతన్నది వొట్టి పిచ్చి మనసన్నది మరో పిచ్చి” అంటూ విరక్తిగా నవ్వేసే వారు ఈశ్వరి. కోయిల గొంతులోని మాధుర్యం దాని రూపంలో లోపించినట్లు , ఈశ్వరి గారి గొంతులోని మాధుర్యం ఆమె జీవితంలో కరువయ్యింది, అదే విధి!!!

gargi!

mallika Sherawat Takes A Hit At Deepika’s Intimating scenes!