in

Fahad fazil had admitted he has ‘ADHD’ at the age of 42

సుకుమార్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన ‘పుష్ప’ మూవీలో భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్ అనే పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో ప్ర‌తినాయ‌కుడిగా న‌టించి ఫ‌హాద్ తెలుగు వారికి బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఇక తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న న‌జ్రియా త‌న భ‌ర్త గురించి ఓ షాకింగ్ విష‌యాన్ని బ‌య‌ట‌పెట్టారు. ఆయ‌న ఓ అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్న‌ట్లు చెప్పారు. ఫ‌హాద్ కొన్ని నెల‌ల నుంచి ‘ఏడీహెచ్‌డీ’తో బాధ‌ప‌డుత‌న్న‌ట్లు పేర్కొంది.

ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్నవారు ఎప్పుడూ ప‌ర‌ధ్యానం, చికాకు క‌లిగి ఉంటార‌ని న‌జ్రియా తెలిపారు. అలాగే ఈ వ్యాధి ఉన్న‌వారిలో హైప‌ర్ యాక్టివిటీ ఎక్కువ‌గా ఉంటుంద‌న్నారు. కానీ, అత‌ని ప‌రిస్థితి గురించి తెలియ‌క‌ముందే తాను ఫ‌హాద్‌తో జీవించ‌డం ప్రారంభించాన‌ని, అత‌ని వ్య‌క్తిత్వ ల‌క్ష‌ణాల‌కు చాలా కాలంగా తాను అల‌వాటు ప‌డ్డాన‌ని ఆమె చెప్పుకొచ్చారు. న‌జ్రియా వ్యాఖ్య‌లు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి..!!

f cube ‘Meenakshi Chaudhary’!