in

f cube ‘ lava kusa’!

FACT 01:

చిత్రంలో ఎన్టీఆర్, అంజలి దేవి జంటగా నటించారు..ఈ చిత్రం తెలుగు నాట వసూళ్ల పరంగా కోటి రూపాయల ఖజానాకు తొలిసారి ద్వారాలు తెరిచింది..ఈ చిత్రానికి కలెక్షన్స్ పరంగా వసూళ్ల వర్షం కురిసిందనే చెప్పాలి.

FACT 02:

మొదట 26 ప్రింట్లతో విడుదలైన ఈ చిత్రం .. విడుదలైన అన్ని కేంద్రాల్లోనూ వంద రోజులుకు పైబడి నడిచి.. నూట యాభై రోజులు అయినా కలెక్షన్స్ లో ఎక్కడా డ్రాప్ కాకుండా నిలబడి రికార్డ్ సృష్టించింది. 18 కేంద్రాలలో రజతోత్సవ వైభవాన్ని పొందింది ఈ చిత్రం. 75 వారాలు ప్రదర్శింపబడి తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసింది. ‘ఎ’ సెంటర్.. ‘బి’ సెంటెర్ అనే తేడా లేదు ప్రతీ సెంటర్లోనూ ఈ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది.

FACT 03:

రెంట్ లేని రోజుల్లో మారుమూల ప్రాంతాల నుండీ జనం సైకిళ్ళు వేసుకుని.. ఫ్యామిలీ ఆడియన్స్ అయితే ఎడ్లబళ్ళు కట్టుకుని … చద్దన్నం మూటలతో థియేటర్స్ కు తరలి వచ్చారు. క్యాబ్ లు, బస్సులు కాదు కదా.. కనీసం కరెంట్ అంటూ లేని రోజుల్లో పావలా, పది పైసల టికెట్ రోజుల్లో 1 కోటి రూపాయలు వసూల్ చేయడమంటే మాటలు కాదు.

FACT 04:

రో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే… ఈ చిత్రం తమిళ వెర్షన్ 40 వారాలు , హిందీ వెర్షన్ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం.ఒక్కమాటలో చెప్పాలంటే… ‘బాహుబలి’ కూడా ఆ విషయంలో ‘లవకుశ’ రికార్డును కొట్టలేదనే చెప్పాలి.

FACT 05:

1-1-1964న వరంగల్ రాజరాజేశ్వరీ థియోటర్ వారు విడుదల చేసిన పత్రికా ప్రకటన ప్రకారం ఆ ఊరిలో లవకుశ చిత్రాన్ని 4,34,800 మంది చూసారు. అయితే అప్పటి వరంగల్ జనాభా కేవలం ఒక లక్ష మాత్రమే. ఆ ప్రకారం ఒక్కో ఒక్కో ప్రేక్షకుడు ఎన్నెన్ని సార్లు ఈ సినిమాని చూసారో ఊహించుకోవచ్చు. అలాగే ఈ చిత్రం కర్ణాటకలోనూ కర్ణాటకలోనూ ఒకే థియోటర్ లో 35 వారాలు ప్రదర్శింపబడింది…..

I had suicidal thoughts: kushbu!

rumors started again on tharun!