ఈవెంట్ కు సంబంధించి కొన్ని ఫోటోలను అనసూయ ట్విట్టర్ వేదికగా అభిమానులతో పంచుకుంది. “నా డ్యాన్స్ పెర్ఫామెన్స్ తో దిగ్గజ తారలకు నివాళి అర్పించే ఛాన్స్ రావడం అదృష్టంగా భావిస్తున్నాను” అని వెల్లడించారు. చాలా మంది ఆమె పోస్టుకు పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. చక్కటి ప్రదర్శనతో ఆకట్టుకున్నారని వెల్లడించారు. అయితే, ఓ నెటిజన్ మాత్రం ఆమెకు కౌంటర్ ఇచ్చాడు. ‘ఎక్స్ పోజింగ్ చేసినంత ఈజీ కాదు..సావిత్రిలా నటించడం అంటే” అంటూ ట్వీట్ చేశారు.
ఈ ట్వీట్ కు అనసూయ రియాక్ట్ అయ్యింది. సదరు నెటిజన్ కు గట్టి సమాధానం చెప్పింది. “నిజం చెప్పారండీ.. సావిత్రమ్మలా నటించడం చేయటం ఎవరి తరం కాదు. నేను కేవలం వారికి నివాళిగా ప్రదర్శన ఇచ్చాను. అంతేకాదు, ఎక్స్ పోజింగ్ చేయడం అనేది కూడా ఈజీ కాదు. ఫిజికల్ గా, ఎమోషనల్ గా చాలా ప్రిపేర్ కావాలి. ఏ పాత్ర చేసినా, ఏ దుస్తులు ధరించినా మన పనిని దృఢ సంకల్పంతో చెయ్యాలి” అని వెల్లడించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది..!!