in

ex-lover Siddharth in Samantha out!

జబర్దస్త్ సినిమా సమయంలోనే సిద్దుతో ప్రేమలో పడింది హీరోయిన్ సమంత. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. అందుకే దోషాలు పోగొట్టుకోవడానికి ప్రత్యేక పూజలు కూడా చేశారు. అయితే చివరి నిమిషంలో ఏం జరిగిందో తెలియదు కానీ ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకుంది సమంత. అక్కడి నుంచి సిద్దార్థ్, సమంత ఎవరి దారి వారు చూసుకున్నారు. ఇదిలా ఉంటే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ జోడి గురించి వార్తలు వచ్చాయి.

తాజాగా సిద్దు ఏడేళ్ల తరువాత తెలుగులో ఒక స్ట్రైట్ సినిమా ఒప్పుకున్నాడు. ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న మహాసముద్రం సినిమాలో సిద్ధార్థ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ మేరకు చిత్ర యూనిట్ అఫీషియల్ గా ప్రకటన కూడా విడుదల చేసింది. ఇందులో శర్వానంద్ మరో హీరో. ఇదిలా ఉంటే మహాసముద్రంలో హీరోయిన్లలో సమంత అక్కినేనిని తీసుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. కథ నచ్చి ఆమె కూడా చేయడానికి ఓకే అనేసింది. కానీ సిద్ధార్థ్ ఈ సినిమాలోకి వచ్చాడని తెలిసిన వెంటనే ఆమె తప్పుకుందనే ప్రచారం జరుగుతుంది.

Kajal Agarwal Eyeing On Web Series!

mass maharaja’s next will be launched soon!