in

embarrassing moment faced by actor ajay!

విలన్​గా, క్యారెక్టర్​ ఆర్టిస్టుగా తన ప్రయాణం మొదలు పెట్టి హీరోగా కూడా నటించాడు. అయితే తాజాగా ఆయన చక్రవ్యూహం అనే సినిమాలో నటిస్తున్నాడు. సస్పెన్స్‌, క్రైమ్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈసినిమాలో అజయ్‌ పోలీస్‌ పాత్రలో నటించాడు. తాజాగా ఈ చిత్ర ప్రమోషన్స్​లో పాల్గొన్న అజయ్ కెరీర్‌ పరంగా తనకు ఎదురైన ఓ చేదు సంఘటన గురించి చెప్పాడు..‘‘శ్రీహరి హీరోగా విజయన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఓ సినిమాలో నేనొక కీలక పాత్ర పోషించాను. సెట్‌లోకి అడుగుపెట్టిన తర్వాతే రేప్‌ సీన్‌ షూట్‌ అని నాకు చెప్పారు.

తీరా, సీన్‌ షూట్‌ చేస్తున్నప్పుడు సదరు నటి (ఉత్తరాదికి చెందిన ఓ మోడల్‌) వెంటనే.. ‘డోంట్‌ టచ్‌’ అని కేకలు వేసింది. రేప్‌ సీన్‌ షూట్‌ అని ఆమెకు చెప్పారో లేదో నాకు తెలియదు. కానీ, ఆక్షణం నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది. నా కెరీర్‌లో నేను ఎదుర్కొన్న ఒక చేదు సంఘటన అదే. కొంతసేపటి తర్వాత ఆ సీన్‌ మొత్తాన్ని రీ రైట్‌ చేసి షూట్‌ చేశారు’’ అని అజయ్‌ వివరించారు. అంతేకాకుండా ఆ తర్వాత తానెప్పుడూ అలాంటి సీన్స్‌లో నటించే ప్రయత్నం చేయలేదని చెప్పాడు.

happy birthday Ilaiyaraaja!

Rana to produce Dulquer salman’s bilingual?