మనీలాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కు ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు ఝలక్ ఇచ్చారు. ఆమెకు చెందిన 7.27 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తున్నాడనే నేరంపై సుకేష్ చంద్రశేఖర్ అనే వ్యక్తిని ఈడీ అధికారులు గత ఏడాది అరెస్ట్ చేశారు. సుకేష్ నేరాలపై ఆరా తీయగా అతడికి బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు గా వెల్లడైంది. తాను దోచుకున్న డబ్బులతో జాక్వెలిన్ కు అతడు 5.70 కోట్ల ఖరీదైన బహుమతులు ఇచ్చినట్లు ఈడీ పరిశోధనలో తేలింది.
జాక్వెలిన్ తో పాటు ఆమె కుటుంబసభ్యులకు సుకేష్ భారీగా నగదు ఇచ్చినట్లు తెలిసింది. ఈ అక్రమార్జన కేసులో పలుమార్లు జాక్వెలిన్ ను ఈడీ అధికారులు విచారించారు. తాజాగా జాక్వెలిన్ కు చెందిన పన్నెండు కోట్ల ఫిక్స్ డ్ డిపాజిట్లను జప్తు చేయడం బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారింది. వ్యాపారవేత్తలు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్ లను చీటింగ్ చేసి 200 కోట్లను సుకేష్ దోచుకున్నాడు. రాజకీయ నాయకుడు దినకరన్ మోసం చేసిన కేసులో సుకేష్ ప్రధాన నిందితుడిగా ఉన్నాడు.