in

dusky beauty Pooja Hegde Says yes To Young Hero?

మధ్య పూజా హెగ్ధే రెండు పెద్ద సినిమాల ఆఫర్లు వదిలేసుకుంది. ఒకటి ‘గుంటూరు కారం’, రెండోది ‘ఉస్తాద్ భగత్ సింగ్’. అయితే, తాజాగా పూజా హెగ్ధేకి ఓ బంపర్ ఛాన్స్ తగిలినట్లు తెలుస్తోంది. ఓ కుర్ర హీరో సినిమాలో పూజా హెగ్దే ఛాన్స్ కొట్టేసిందట. కుర్ర హీరో సినిమానే కదా.. స్కేల్ తక్కువగా వుంటుందనుకుంటే పొరపాటే. ‘గుంటూరు కారం’, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ టైమ్‌లో పూజా హెగ్ధే డిమాండ్‌కి తగ్గట్టుగా పలికిన రెమ్యునరేషనే ఇప్పుడు ఈ తాజా సినిమా విషయంలోనూ పలుకుతోందట.

ఆ మాటకొస్తే, ఇంకాస్త ఎక్కువే ముట్టచెబుతున్నారట. ఓ ప్రముఖ దర్శకుడు ఆ కుర్రహీరోతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడట. అలాగే, ఓ టాప్ నిర్మాణ సంస్థ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోందట. ఫిల్మీ బ్యాక్ గ్రౌండ్‌కి చెందిన హీరో అట ఆ కుర్రోడు. ఇంతకీ ఎవరా కుర్రహీరో.? ఏంటా కథ.? ఏది ఏమేతేనేం, బుట్టబొమ్మకి మాత్రం ఇది బిగ్ ఛాన్స్ అనే చెప్పాలేమో. ఈ మధ్య టాలీవుడ్‌లో పూజా హెగ్ధే పనైపోయిందన్న గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఈ తరుణంలో ఇలాంటి ఓ బిగ్ ప్రాజెక్ట్ తగలడం విశేషమేగా…!!!

good news for happening beauty sreeleela fans!

anadhaga maraninchina andhala villain mahesh anand!