నాగ అశ్విన్ దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్ తో వైజయంతి సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా జనవరి 12 2024న సంక్రాంతి సందర్భంగా విడుదలవుతుందని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఒకరకంగా ప్రస్తుతానికి ప్రభాస్ ఫ్యాన్ ఇండియా స్టార్ డం ఎంజాయ్ చేస్తున్నాడు. ఆయన చేసిన రాధేశ్యామ్, సాహో వంటి సినిమాలు పాన్ ఇండియా మార్కెట్లో ఏ మాత్రం సాటిస్ఫై చేయలేకపోయినా ఇప్పుడు చేస్తున్న అన్ని సినిమాల మీద భారీ అంచనాలు ఉన్నాయి.
ఒక పక్క ప్రాజెక్టు కే, మరోపక్క ఆది పురుష్ ఇంకో పక్క సలార్ వంటి ఆసక్తికరమైన ప్రాజెక్టులను ప్రభాస్ లైన్ లో పెట్టారు. మహానటి దర్శకుడు నాగ అశ్విన్ తెరకెక్కిస్తున్న ప్రాజెక్టు కే మీద దాదాపు అందరి చూపు ఉంది. ఇక తాజాగా టాలీవుడ్ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం మేరకు దుల్కర్ సల్మాన్ ప్రాజెక్ట్ కేలో ఒక కీలకమైన పాత్రలో నటిస్తున్నాడు. తాజా ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ ఈ విషయాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఇండియన్ సినీ చరిత్రలోనే ఒక అత్యద్భుతమైన సినిమాగా నిలుస్తుందని ఆయన కామెంట్ చేసినట్టు తెలుస్తోంది..!!