డీజే టిల్లు బ్లాక్ బస్టర్ హిట్టయి ఆడియెన్స్ ‘ సో స్వీట్ ఆఫ్ యూ’ అంటూ సిధ్ధును మెచ్చుకునే సరికి డబుల్ జోష్ తో పార్ట్ టూ కూడా అనౌన్సయి పూజా కార్యక్రమాలు కూడా జరిగాయి. ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లి త్వరలోనే మళ్లీ టాకీసుల్లో టాప్ లేపుతుంది అనుకుంటుండగా,ఈ ప్రాజెక్ట్ గురించి ఓ లేటెస్ట్ గాసిప్ టాలీవుడ్లో చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. డైరెక్టర్ విమల్ కృష్ణ ఈ ప్రాజెక్ట్ నుంచి క్విట్ అయ్యాడట..పార్ట్ వన్ డైరెక్ట్ చేసి, అనౌన్సయిన సీక్వెల్ నుంచి ఎందుకు సైడయ్యాడు అనంటే..రైటింగ్ లో కాంట్రిబ్యూట్ చేయడం వరకూ ఓకే కానీ..మూవీ మేకింగ్ అండ్ టేకింగ్ లోనూ సిద్ధు వేలు, కాళ్లు పెట్టడమే రీజనట. డీజే టిల్లు టైమ్ లోనూ దాదాపు ఇదే జరిగిందట..
కొన్ని సీన్స్ కి విమల్ ఘోస్ట్ డైరెక్టర్ గా మారాల్సిన పరిస్థితి వచ్చిందట. మరోవైపు సిద్ధు రైటింగ్ లో వచ్చిన మూవీస్ సక్సెస్ సాధించినా డైరెక్టర్స్ ఎలివేట్ అవ్వరనేది ఆల్రెడీ కాస్త స్ట్రాంగ్ గా ఉన్న టాకే. దాంతో దర్శకుడు విమల్ కృష్ణ ‘అసలే డెలికేట్ మైండ్ నాది’ టాలెంట్ ను తొక్కేస్తే సైలెంటు గుండా అంటూ టాటా చెప్పాడనేది ఇన్ సైడ్ టాక్. ఇక వెళ్లిపోయిన డైరెక్టర్ వెంటపడ్డం కంటే.. స్టోరీ అండ్ కంటెంట్ ను నమ్మకుని సీక్వెల్ ని త్వరలోనే తెరకెక్కించే పనిలో పడుతున్నారట మేకర్స్. అన్నీ అనుకున్నట్టుగా వర్కవుట్ అయితే ఓ కొత్త డైరెక్టర్ కి ఈ ప్రాజెక్ట్ ని అప్పజెప్పబోతున్నారట. త్వరలోనే ఈ కన్ ఫ్యూజన్ కి క్లారిటీ వచ్చేలా అఫీషియల్ అనౌన్స్ మెంట్ కూడా చేయబోతున్నారట.