in

Director Teja launching his son Amitov with ‘Vikramaditya’!

వరసగా ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు చూస్తున్న ఆడియన్స్ కి యూత్ ఫుల్ మూవీస్ తో ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ ఇచ్చి.. తనకంటూ ట్రెండ్ క్రియేట్ చేస్తున్నాడు డైరెక్టర్ తేజ. టాలీవుడ్ హీరోలకి లాంచ్ ప్యాడ్ లా కొత్త హీరోల్ని ఇంట్రడ్యూస్ చేసి కెరీర్ స్టార్టింగ్ లోనే అదిరిపోయే హిట్స్ ఇచ్చిన తేజ.. చాలా కాలం తర్వాత మరో కొత్త హీరోని టాలీవుడ్ కి పరిచయం చేస్తున్నారు. డైరెక్టర్‌ తేజ ప్రస్తుతం రానా సోదరుడు అభిరాం దగ్గుబాటి హీరోగా అహింస మూవీ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాతో అభిరాం హీరోగా పరిచయం కానున్నాడు. భిన్న కథలతో కొత్త హీరోలను ఇండస్ట్రీకి పరిచయం చేసే తేజ ఇప్పుడు ఆయన తనయుడిని హీరోగా చూపించబోతున్నాడు. ఫిబ్రవరి 22 తేజ బర్త్‌డే సందర్భంగా ఆయన కొత్త సినిమాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో ఆయన పిరియాడిల్‌ ఎపిక్‌ లవ్‌స్టోరిగా విక్రమాదిత్య మూవీని రూపొందిస్తున్నట్లు వెల్లడించాడు. ‘విక్ర‌మాదిత్య‌’ 1836లో జ‌రిగే ప్రేమ క‌థా చిత్ర‌మిది. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ దవళేశ్వరం బ్రిడ్జిని కట్టిన సమయంలో జరిగిన కథగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ప్రేమకు బ్రిడ్జితోనూ అనుబంధం ఉన్నట్టు చూపించబోతున్నార‌ని అర్థ‌మ‌వుతుంది. ఎంద‌రో కొత్త న‌టీన‌టుల‌ను ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన తేజ‌..ఇప్పుడు త‌న కొడుకుని ఇండస్ట్రీకి ప‌రిచ‌యం చేస్తున్నారు. అలాగే ఉద‌య్ కిర‌ణ్‌, నితిన్ వంటి యంగ‌స్ట‌ర్స్‌కి బ్లాక్ బ‌స్ట‌ర్స్ ఇచ్చిన ఈ సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు త‌నయుడు అమిత‌వ్‌కి ఎలాంటి హిట్ ఇస్తారో తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.

Happening Heroines to support rashmika mandanna’s next!

Madhuri Dixit: Stardom doesn’t define or excites me!