in

director Sukumar says Sai Pallavi ‘the Lady Pawan Kalyan’!

ఫిబ్రవరి 27న హైదరాబాద్ శిల్పాకళా వేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్. ఈ వేడుకకు స్టార్ హీరోయిన్స్ సాయి పల్లవి, కీర్తి సురేష్.. డైరెక్టర్ సుకుమార్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ క్రమంలో సాయి పల్లవిని పొగడ్తలతో ముంచేశారు డైరెక్టర్ సుకుమార్..ఈ సందర్భంగా సుకుమార్.. మాహానటి కీర్తి సురేష్ గురించి మాట్లాడిన తర్వాత సాయి పల్లవి గురించి మాట్లాడారు. డైరెక్టర్ సుకుమార్.. సాయి పల్లవి పేరు ఎత్తగానే శిల్పకళావేదిక ఆడిటోరియం మొత్తం అరుపులతో దద్దరిలిపోయింది.

వెంటనే సాయి పల్లవి సుకుమార్ చెవిలో ఏదో చెప్పింది. దానికి సుకుమార్.. సాయి పల్లవి నా చెవిలో ఏం చెప్పిందో తెలుసా ? తన గురించి చెప్పేదేమైనా ఉంటే తనతోనే చెప్పమని అంటుంది. ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తుంటే.. సాయి పల్లవి లేడీ పవన్ కళ్యాణ్ అనిపిస్తోంది. తన గురించి ఎప్పుడూ మాట్లాడదామన్నా కుదరలేదు. ఆమె ఆర్టిస్ట్ అనే విషయం అందరికీ తెలిసిందే.. కానీ ఒక యాడ్ రిజెక్ట్ చేసే విషయంలో ఆమె అందరికీ గుర్తిండిపోతుంది. వ్యక్తిగతంగా ఈ విషయం చెప్పాలనుకున్నా.. కానీ కుదరలేదు. యాడ్ రిజెక్ట్ చేయడం నాకు చాలా బాగా అనిపించింది. అంత హ్యూమన్ బీయింగ్ తో ఉండడం చాలా కష్టమైన విషయం అంటూ సాయి పల్లవిపై పొగడ్తల వర్షం కురిపించాడు.

Aadavallu Meeku Johaarlu Trailer, Sharwanand, Rashmika Mandanna!

shocking : Robbery in Vishnu Manchu’s office