డైరెక్టర్ రాఘవేంద్ర రావు గారి గడ్డం వెనుక చాల పెద్ద కధే ఉంది, మైదానం లో ఆటలు ఆడే వారికీ, తెర మీద ఆడే వారికీ, ఆడించే వారికీ కొన్ని నమ్మకాలూ ఉండ టం ఆనవాయితీ. 1975 లో డైరెక్టర్ గ తన మొదటి చిత్రం ” బాబు ” చాల భారీ బడ్జెట్ తో నిర్మించారు, అది కాస్త నిరాశ మిగిల్చింది, ఒక ఛాలెంజ్ గ అతి తక్కువ బడ్జెట్ తో 28 రోజులలో జయసుధ హీరోయిన్ గ ” జ్యోతి ” అనే సినిమా ఒక యజ్ఞం ల చేసారు, అప్పుడు పెంచారు గడ్డం రాఘవేంద్ర రావు గారు. సినిమా రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది..
జ్యోతి సినిమా ఒక కొత్త ప్రయోగం ,ఇండస్ట్రీ అంత రాఘవేంద్ర రావు వైపు చూసింది. తెలుగు ప్రేక్షకులు నీరాజనం పలికారు, రాఘవేంద్ర రావు గారు తన ఇష్ట దైవం తిరుపతి వెంకన్న ను దర్శించుకొని కొండ మీద గడ్డం తీశారు. అది మొదలు అంటే 1976 నుంచి ఇప్పటి వరకు, అంటే 45 సంవత్సరాల తన కెరీర్ లో అయన బయట ఎక్కడ గడ్డం తీయలేదు. 105 సినిమాలు చేసిన ఆయన సినిమా రిలీజ్ తరువాత వెంకన్న ను దర్శించుకోవటం గడ్డం తీయటం ఒక ఆనవాయితీ గ పెట్టుకున్నారు.