in

eesha rebba said no to kissing scene!

షా రెబ్బా.. ఈ అందాల భామకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఓ రెంజ్ లో ఉంది కానీ స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోతుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ డైరెక్షన్లో వచ్చిన ‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రంతోనే హీరోయిన్ గా మారి మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఆ తరువాత ‘అమీ తుమీ’ ‘అ!’ వంటి సినిమాఅలతో కుర్రకారును తనవైపు తిప్పుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన గ్లామర్ ఫోటోలను పోస్ట్ చేస్తూ.. ఫ్యాన్స్ ను ఫిదా చేస్తోంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఈ బ్యూటీ తన అభిమానులతో ముచ్చటించి.. కొన్ని ఆసక్తికర విషయాలను చెప్పింది. ఈషా మాట్లాడుతూ.. ” షూటింగ్ టైంలో ఒక హీరో నన్ను ముద్దు పెట్టాలని ట్రై చేసాడు. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు. సీన్ వంకతో మళ్ళీ నన్ను కన్విన్స్ చేసే ప్రయత్నం కూడా చేశాడు. అయినా నేను ఒప్పుకోలేదు” అంటూ చెప్పుకొచ్చింది. అయితే ఆ హీరో ఎవరు అన్న విషయం మాత్రం ఈషా చెప్పలేదు. దాంతో ఈషాకు ముద్దు పెట్టాలనుకున్న హీరో ఎవరై ఉంటాడా? అనే సోషల్ మీడియాలో డిస్కషన్లు నడుస్తున్నాయి.

director k raghavendra rao gari gaddam venakunna rahasyam!

superstar mahesh babu wants trivikram again!