in

Deshamuduru Beauty emotional post about her mother!

ప్రతీ మనిషి జీవితంలో ఒకరికి ప్రత్యేక స్థానం ఉంటుంది. వారినే మనం ఎక్కువగా ఇష్టపడుతుంటాం, ఆరాధిస్తుంటాం. వారితో మనకున్న సాన్నిహిత్యాన్ని, బంధాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. తన జీవితంలో అలాంటి వ్యక్తి తన తల్లే అని చెబుతోంది నటి హన్సిక. శుక్రవారం హన్సిక మధర్‌ మోనా మాత్వాని పుట్టిన రోజు. ఈ సందర్భంగా హన్సిక ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ చేశారు. మోనా యంగ్‌ ఏజ్‌లో ఉన్న ఫొటోలతో పాటు తన తల్లితో గడిపిన మధుర క్షణాలకు సంబంధించిన ఫొటోలను పోస్ట్‌ చేసిన హన్సిక..

‘హ్యాపీ బర్త్‌డే అమ్మ.. నువ్వు నాకు ఎంత ముఖ్యమో మాటల్లో వర్ణించలేను. మీరే మా ప్రపంచం.. మాకు ఇంత మంచి జీవితాన్ని ఇచ్చినందుకు ధన్యవాదాలు’ అంటూ కాస్త ఎమోషనల్‌ అయ్యారు. ఇదిలా ఉంటే హన్సిన తల్లి.. మోనా ఒక డెర్మటాలజిస్ట్‌. హన్సిక చిన్నతనంలోనే అతని తండ్రి ప్రదీప్‌ ఇంటి నుంచి వెళ్లిపోయారు. దీంతో మోనానే తన ఇద్దరు పిల్లల్ని పెంచి పోషించారు. హన్సికకు ఒక సోదరుడు ఉన్నారు.

Hottest Photoshoot of Eesha Rebba in Denim Shorts!

hot poses of Jhanvi Kapoor in Skintight Bodycon!