in

deshamudhuru girl finally gives clarity on her marriage!

న పెళ్లి వార్తలపై కథానాయిక హన్సిక క్లారిటీ ఇచ్చేసింది. తన డైరీలో పెళ్లన్న మాటకు స్థానం లేదంటోంది. దేశముదురు సినిమాతో తెలుగు చిత్ర సీమలో అడుగుపెట్టిన హన్సిక కొన్ని సినిమాలు చేసినా అనుకున్నంతగా రానించలేక పోయింది. కానీ ప్రస్తుతం తమిళ నాట స్టార్ హీరోయిన్ హోదాలో ఉంది. అవకాశాలు ఉన్నప్పడు కుదిరనన్ని సినిమాలు చేయడం, అవకాశాలు లేనప్పడు పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడం నవతరం హీరోయిన్ల ట్రెండ్‌గా మారింది.

కానీ ఈ దేశముదురు బామ మాత్రం కెరీర్ స్లో అయితే పెళ్లి చేసుకోవాలా అంటూ ఎదురు దాడికి దిగుతోంది. ఇటీవల హన్సిక కెరీర్ నెమ్మదించడంతో ఇక ఆమె వివాహం చేసుకుంటుందని ప్రచారం జరిగింది. ఆ వార్తలకు బాధపడిన హన్సిక ఘాటుగా రిప్లై ఇచ్చింది. తన డైరీలో పెళ్లన్న మాటకు కూడా తావులేదని తెగేసి చెప్పింది. ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ బ్యూటీ లాక్‌డౌన్ టైంలో వర్కౌట్లు చేసీ స్లిమ్‌గా తయారైంది. సినిమా ఆఫర్లు రాకపోతే ఓటీటీపై మొగ్గుచూపుతుందని తమిళ సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఈ ముద్దుగుమ్మ ఏం చేస్తుందో చూడాలి.

superstar rajinikanth cancels his politics entry!

VISHWAK SEN AND KARTIKEYA IN FOR A SUSPENSE THRILLER?