in

Deepika Padukone tops IMDb’s ‘most viewed Indian stars of last decade’ list!

బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. 2014 నుంచి 2024 వరకు గత దశాబ్ద కాలంలో ఐఎండీబీలో ఎక్కువ మంది చూసిన టాప్‌ ఇండియన్‌ స్టార్‌గా ఆమె మొదటి స్థానాన్ని దక్కించుకున్నారు. ఈ జాబితాను ఐఎండీబీ సోషల్‌ మీడియా వేదికగా విడుదల చేసింది. మొదటి స్థానంలో దీపిక ఉండగా, రెండో స్థానంలో షారూఖ్‌ ఖాన్‌, మూడో స్థానంలో అలియా భట్‌లు ఉన్నారు..

ఈ విషయమై దీపికా మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను లెక్కించే ఈ లిస్టులో అగ్ర స్థానంలో ఉండటం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఐఎండీబీ కి చాలా క్రెడిబిలిటీ ఉందన్నారు. అలాంటి లిస్టులో తాను మొదటి స్థానంలో ఉండటం తనకు చాలా ప్రత్యేకం అంటూ చెప్పుకొచ్చారు. 2007లో సినిమా రంగంలోకి అడుగు పెట్టిన దీపిక ఇప్పుడు తెలుగులోనూ నటించారు. ప్రభాస్‌ హీరోగా నటించిన కల్కి 2898 ఏడీ అనే సైన్స్‌ ఫిక్షన్‌ సినిమాలో ఆమె నటించిన విషయం మనందరికీ తెలిసిందే..!!

tollywood beauties getting busy in bollywood!

homely beauty Keerthy Suresh lip lock with Varun Dhawan?