దర్శక నిర్మాత తమ్మా రెడ్డి. భరద్వాజ గారిది కమ్యూనిస్ట్ కుటుంబం, స్టూడెంట్ గ అల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ నాయకుడు, జార్జి రెడ్డి స్నేహితుడు, వెరసి తెలుగు సినీ ఇండస్ట్రీ లో మొండివాడు అని పేరు. ఒక సందర్భం లో దర్శక దిగ్గజం దాసరి గారితో ఢీ కొట్టిన మొండి ఘటం. రేలంగి నరసింహ రావు ను దర్శకుడిగా పరిచయం చేయమని భరద్వాజ తో చెప్పారు దాసరి, రేలంగి దర్శకత్వం లో అంతా కొత్త నటులతో ” మరో కురుక్షేత్రం” అనే సినిమా ప్రకటించారు భరద్వాజ, ఆ చిత్రానికి మాటలు దాసరి గారు వ్రాస్తానని చెప్పారు. కానీ దాసరి ఓ రోజు భరద్వాజను పిలిచి స్క్రిప్ట్ బాగాలేదు షూటింగ్ ఆపేద్దాం అని చెప్పారు. షూటింగ్ ఆపటం ఇష్టం లేని భరద్వాజ ముందుకు వెళ్ళాలి అనుకున్నారు,
ఆ సమయంలోనే నిర్మాత వడ్డే రమేష్ కొత్త తారలతో ” మరో కురుకేత్రం” సినిమా తీస్తున్నట్లు ప్రకటించారు, దానికి రచయిత దాసరి గారే. అది చుసిన భరద్వాజ చిరంజీవి, లేదా కృష్ణం రాజు తో ఆ సినిమా తీయాలని వారి డేట్స్ అడిగారు, దాసరి కి వ్యతిరేకం గ నటించటానికి వారు ముందుకు రాలేదు. అయినా మన వాడు మొండి వాడు కదా, సినిమా పరిశ్రమలో ఎంతో మంది నచ్చ చెప్పటానికి ప్రయత్నించినా వినకుండా, మాదాల రంగా రావు ని హీరో గ పెట్టి, దర్సకత్వం చేయటానికి ఎవరు ముందుకు రాకపోయేసరికి, తన తమ్ముడు తమ్మారెడ్డి లెనిన్ బాబు ని దర్శకుడిగా పెట్టి ” మరో కురుక్షేత్రం ” సినిమా పూర్తి చేసారు. ఇక చేసేది లేక వడ్డే రమేష్ గారు తన చిత్ర నిర్మాణం ఆపేసారు. తమ్మా రెడ్డి భారద్వాజా మజాకా..