in

creative Director Krishna Vamsi Announces ‘Annam’!

 

హా శివ‌రాత్రి శుభాకాంక్ష‌లు. మై నెక్స్ట్ ఎన్ ఎక్స్‌ప్లోజివ్‌.. ఓం న‌మఃశివాయ‌` అని ట్వీట్ చేసిన కృష్ణ‌వంశీ త‌న కొత్త చిత్రం టైటిల్ పోస్టర్ ని షేర్ చేశారు. టైటిల్ పోస్ట‌ర్ చాలా శక్తివంతంగా వుంది. ప‌రబ్ర‌హ్మ స్వరూపం’ అని టైటిల్‌కు ట్యాగ్‌లైన్ ని ఇచ్చారు. దీంతో ఈ పోస్ట్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. టైటిల్ పోస్ట‌ర్‌లో అరటి ఆకుపై రక్తపు మరకలు కనిపిస్తుండ‌గా బియ్యంతో  తెలుగు అక్షరాలతో టైటిల్ వ్రాశారు. టైటిల్ పోస్టర్‌లో ర‌క్తం ఓడుతున్న అర‌టాకు.. ఒక కొడవలి  మంగళసూత్రం కనిపిస్తున్నాయి.

రిజిస్ట్రేషన్, ఉచిత పథకాలు, ఆత్మహత్య, ల్యాండ్ మాఫియా, కాల్ మ‌నీ వంటి ఆంగ్ల పదాలు క‌నిపిస్తున్నాయి. అంటే కృష్ణ‌వంశీ  న‌వ‌ర్‌ఫుల్ క‌థాంశాన్ని తీసుకున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. రైతు స‌మ‌స్య‌లే ప్ర‌ధానంగా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న‌ట్టుగా క‌నిపిస్తోంది. కొన్నేళ్ల క్రితం కృష్ణ వంశీ నందమూరి బాలకృష్ణతో `రైతు’ చిత్రాన్ని చేయాల‌ని ప్లాన్ చేశాడు. కానీ ఈ మూవీ కార్య‌రూపం దాల్చ‌లేదు. కానీ ఇప్పుడు ఈ చిత్రాన్ని కృష్ణ‌వంశీ ప్లాన్ చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తోంది

sreekaram!

‘Hari Hara Veera Mallu’s First Glimpse, Pawan Kalyan, director krish!