తెలుగు సినిమాలలో వాడే భాషలో కొన్ని కొత్త ప్రయోగాలు చేసే వారు అందుకు కొన్ని ఉదాహరణలు మాయాబజార్ చిత్రంలో ఘటోత్గజుడు వాడిన ” వీరతాళ్ళు” చిన్నమయ్య వాడిన “తసమదీయులు” కింబళీ” వంటి కొత్త పద ప్రయోగాలు ఇప్పటికి ప్రేక్షకుల మనసుల్లో ఉండిపోయాయి ఇటువంటి పదాలు సృష్టించటం లో పింగళి నాగేంద్ర గారు నిష్ణాతులు. ఆ మధ్య వచ్చిన మిధునం చిత్రంలో తనికెళ్ళ కలం నుంచి జాలువారిన “అద్భుతహ!” వంటి పదప్రయోగాలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఏకంగా ఒక భాషనే ప్రెవేశ పెట్టి అందరిని ఆశ్చర్య పరచిన చిత్రం రాజమౌళి గారి బాహుబలి. అందులో కాలకేయుడు వాడిన” కిలికి భాష” అందరిని ఆకట్టుకుంది. ఆ భాష వినటానికి నేర్చుకోవటానికి కొంత మంది ప్రేక్షకులు మళ్ళీ, మళ్ళీ ఈ చిత్రాన్ని చూసారు అనటం లో ఎటువంటి అతిశయోక్తి లేదు.
అసలు ఈ భాషను కనిపెట్టిన మహనీయుడు ఎవరు? కిలికి భాష సృష్టికర్త తమిళ మాటల రచయిత అయిన మదన్ కర్కి వైరముత్తు. ఏడు సార్లు జాతీయ అవార్డు అందుకున్న తమిళ రచయిత వైరముత్తు పెద్ద కుమారుడు. కంప్యూటర్ సైన్స్ లో పి.హెచ్.డి. చేసి లెక్చరర్ గ పని చేస్తూ సినీ రంగ ప్రవేశం చేసిన మదన్ కర్కి తమిళంలో మంచి గుర్తింపు పొందాడు. ఈ సమయంలోనే బాహుబలి అవకాశం రావటం తో మదన్” కిలికి భాష” సృష్టించి అందరిని ఆశ్ఛర్య పరిచాడు. ఇటువంటి భాషను సినిమాలలో ఉపయోగించటం ఇదే మొదటి సారి. ఈ భాష కోసం హిందీ,ఇంగ్లీష్, తమిళం, సంస్కృత భాషల నుండి కొన్ని అచ్చులు, హల్లులు పోనీ టిక్స్ తీసుకొని ఏకంగా 750 కొత్త పదాలను సృష్టించాడు మదన్ కర్కి. ఇతను సృష్టించిన ఈ భాష సినిమాకు హై లైట్ గ నిలిచింది, మదన్ కు జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది..!!