బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గతకొంతకాలంగా ఓ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజమని క్లారిటీ వచ్చేసింది. కత్రినా, విక్కీ రిలేషన్ పై అనిల్ కపూర్ తనయుడు హర్ష్ వర్ధన్ కపూర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ‘బై ఇన్విట్ ఓన్లీ సీజన్ 2’ షోలో హర్ష్ కనిపించాడు. ఈ షోలో భాగంగా హర్ష్ మాట్లాడుతూ “విక్కీ, కత్రినా కలిసి ఉన్నారు.
ఇది నిజం” అని చెప్పి, ఆ వెంటనే “నేను ఈ మాట చెప్పినందుకు ఇబ్బందుల్లో పడుతున్నానా? నాకు తెలియదు” అని తెలిపాడు. ఆ వెంటనే సోషల్ మీడియాలో వారి అభిమానులు #విక్కాట్, #విక్ట్రినా అనే హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండ్ చేశారు. ప్రస్తుతం ఈ విషయం బి-టౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. బీ-టౌన్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రీనా లవ్ స్టోరీ కొత్తదేం కాదు. ఇంత వరకూ ఒకటి, రెండు ఫోటోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేయటం, డిలీట్ చేయటం లాంటి పనులు చేశారు..