మొన్న శుక్రవారం విడుదలైన వాటిలో రక్షణ పేరుతో ఒక సినిమా ఉంది. ఎవరో ముక్కు మొహం తెలియని ఆర్టిస్టులైతే డిస్కషన్ అక్కర్లేదు కానీ అరెక్స్ 100 ఫేమ్ పాయల్ రాజ్ పుత్ పోలీస్ ఆఫీసర్ గా నటించడం వల్ల కొంత ఫోకస్ పడింది. కంటెంట్ కన్నా ఎక్కువ దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకూర్, హీరోయిన్ మధ్య నెలకొన్న వివాదం కారణంగా కొన్ని రోజులు వార్తల్లో నిలిచింది. బాలన్స్ ఇవ్వలేదని పాయల్, ఇప్పుడు చెల్లిస్తాము ప్రమోషన్ కు రమ్మని ప్రొడ్యూసర్ ఒకరిమీద మరొకరు అభియోగాలు చేసుకుని చివరికి పబ్లిసిటీ లేకుండానే రిలీజ్ చేశారు. తీరా చూస్తే దీనికి కనీస స్పందన కరువై షోలు తగ్గిపోతున్నాయి. దీంతో పాయల్, మానస్ వగైరా ఆర్టిస్టులు ఎంత బాగా నటించినా కంటెంట్ లో బలం లేకపోవడంతో సినిమాకు సరైన రక్షణ లేకుండా పోయింది..!!