వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా అంటే ఎవరో తెలుసా, ధనుష్ తెలుసా? అయితే ఒకే. ధనుష్ చెఫ్ కావాలి అనుకోని, వాళ్ళ నాన్న, అన్నయ్య ప్రోద్బలం తో నటుడు అయ్యాడు. తన పెర్సనాలిటీ, రంగు మీద అసలు నమ్మకం లేని ధనుష్ సినిమా హీరో అవుతానని కలలో కూడా అనుకోలేదు. ధనుష్ తండ్రి కస్తూరి రాజా తమిళ్ లో డైరెక్టర్, ఆయన కోసం 2002 లో ఒక సినిమా చేసాడు, వీడు ఏం హీరోరా బాబు అన్నారు జనం, ధనుష్ అన్నయ్య డైరెక్టర్ గ తన మొదటి సినిమా అయిన కాదల్ కొండై, 2003 లో ఒక నెగటివ్ రోల్ లో చేసాడు.
ఆ తరువాత ఫోటోగ్రఫీ మాంత్రికుడు, బాలు మహేంద్ర చిత్రం లో నటించాడు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది అని బాలు మహేంద్ర మెచ్చుకోవటం తో నటనను సీరియస్ గ తీసుకున్న ధనుష్, 2010 లో వెట్రిమారన్ డైరెక్షన్ లో “ఆడుకాలం “అనే చిత్రం లో కోడి పందాలు వేసే జాకీ గ నటించాడు, ఆ చిత్రం అతనికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు గ్రహీతను చేసింది. అసలు నటనే వద్దు అనుకున్న ధనుష్ నేషనల్ అవార్డు రావటం తో ఆ కిక్కే వేరప్పా అనిపించి, నటనను మరింత సీరియస్ గ తీసుకొని తమిళం లో ఒక మంచి నటుడిగా ఎదిగాడు. జాతీయ ఉత్తమ నటుడిగా రెండు సార్లు , జాతీయ ఉత్తమ నిర్మాత గ రెండు సార్లు అవార్డులు అందుకున్నాడు.