in

can young Beauty Bhagyashri Borse change her fortunes?

అందానికి భాషతో పనిలేదు..అందం ప్రధమ లక్షణం..ప్రధాన లక్షణం ఆకర్షించడమే. అందువల్లనే కొత్త అందాలను ఎప్పటికప్పుడు మేకర్స్ తెరపైకి తీసుకుని వస్తుంటారు. ఒకప్పుడు ఇలా కొత్తగా వచ్చిన హీరోయిన్స్ సంఖ్య ఎక్కువగా కనిపించేది. ఏ హీరోయిన్ ను ఎంచుకోవాలా అనే ఒక ఆలోచనలో మేకర్స్ తర్జనభర్జనలు పడేవారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.

కృతి శెట్టి, శ్రీలీల తరువాత ఇండస్ట్రీకి వచ్చిన హీరోయిన్స్ లో అటు గ్లామర్ పరంగా..ఇటు నటన పరంగా ఔరా అనిపించిన వాళ్లయితే ఎవరూ లేరు. ఆషిక రంగనాథ్ కొంతవరకూ ఆకట్టుకోగలిగిందంతే. ఈ నేపథ్యంలోనే ‘భాగ్యశ్రీ బోర్సే’ అనే మరో బ్యూటీ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో ఈ సుందరి ఎంట్రీ ఇస్తోంది. పోస్టర్లతోనే పోలో మంటూ మనసులు దోచేస్తున్న ఈ భామ, ఈ సినిమా హిట్ అయితే జోరు చూపించే ఛాన్స్ ఉందని అభిప్రాయపడుతున్నారు. చూడాలి మరి ఈ సుందరి దూకుడు ఏ రేంజ్ లో ఉంటుందో..!!

Balayya as Ranga in Aavesham Telugu Remake?

prabhas to romance trisha again?