in

BUSY girl SREE LEELA FOR ROWDY BOY?

రౌడీ హీరో విజయ్ దేవరకొండ తన దృష్టిని ‘ధమాకా’ పిల్ల శ్రీలీల మీద పెట్టాడు..ప్రస్తుతం సమంత సరసన శివ నిర్వాణ దర్శకత్వంలో ‘ఖుషి’ చిత్రంలో నటిస్తుండగా, విజయ్ – గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రాబోయే ప్రాజెక్ట్‌లో నటిస్తున్నాడు..ఇందుకోసం ముందుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న ను హీరోయిన్ గ అనుకున్నారు కానీ ఎందుకో ఈ జోడి కుదరలేదు..దింతో ఈ చిత్ర నిర్మాతలు విజయ్ సరసన శ్రీలీలని పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ ఉత్తేజకరమైన జత అభిమానులలో చాలా ఆసక్తి రేపుతోంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.

ఈ సినిమాలో విజయ్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నాడు. శ్రీలీల ఇప్పటికే మహేష్ బాబుతో త్రివిక్రమ్ సినిమా, సాయి ధరమ్ తేజ్‌తో ‘వినోదాయ సీతం’ రీమేక్, బోయపాటి శ్రీను సినిమాలో రామ్ సరసన నటిస్తూ పలు ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. ఆమె బాలకృష్ణతో అనిల్ రావిపూడి యొక్క తదుపరి చిత్రంలో కూడా కనిపించనుంది.. అలాగే పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం చర్చలు జరుపుతున్నట్లు టాలీవుడ్ కోడై కూస్తుంది..!!

malayali beauty Samyuktha Menon becomes a ‘lucky charm’!

Kushboo reveals she was sexually abused by her father!