in

Bumper offer for jabardasth Beauty rashmi gautham!

ష్మి గౌతమ్ ఒక సినీ నటి, టి. వి వ్యాఖ్యాత. ఈటివిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ హాస్యకార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోంది.టాలీవుడ్‌లో నటిగా తనకంటూ ఓ గుర్తింపు సొంతం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు నటి రష్మి. యాంకర్‌గా బుల్లితెరపై ఫుల్‌ క్రేజ్‌ దక్కించుకున్న ఈ బ్యూటీ తాజాగా బంపర్‌ ఆఫర్‌ కొట్టేసినట్లు తెలుస్తోంది. సోదరి సెంటిమెంట్‌తోపాటు యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ‘భోళాశంకర్‌’ చిత్రానికి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమం ఎంతో వేడుకగా జరిగింది.

ఇందులో రష్మి కూడా నటిస్తుందని అదేరోజు చిత్రబృందం అధికారికంగా ప్రకటించేసింది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ‘భోళాశంకర్‌’లో మాస్‌ డ్యాన్స్‌ ఉంటే బాగుంటుందని.. అందులోనూ చిరు డ్యాన్స్‌ చేస్తే థియేటర్‌ దద్దరిల్లిపోతుందని చిత్రబృందం భావించిందట. ఈమేరకు సంగీత దర్శకుడితో కలిసి ఓ మాస్‌ సాంగ్‌కి సన్నాహాలు చేస్తోందట. అంతా ఓకే అయితే.. ఆ పాటలో చిరుతో కలిసి రష్మి స్టెప్పులేయనున్నారని సమాచారం. శేఖర్‌ మాస్టర్‌ ఈపాటకు కొరియోగ్రఫీ చేయనున్నారని నెట్టింట్లో ప్రచారం సాగుతోంది. అదే కనుక నిజమైతే రష్మికి బంపర్‌ ఆఫర్‌ వరించినట్లే. తమిళంలో సూపర్‌హిట్‌ అందుకున్న ‘వేదాళం’ రీమేక్‌గా ‘భోళాశంకర్‌’ తెరకెక్కుతోంది.

no benefit shows in ap, a big blow to big-budget movies!

First Time In Indian OTT: Republic To Have Director’s Commentary!