in

Budding Telugu actress Pavani Karanam in pushpa 2!

సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. ఇక పుష్ప సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అల్లు అర్జున్ ని పాన్ ఇండియా స్టార్ చేయడమే కాకుండా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా చేసింది. పుష్పరాజ్ మానియా ప్రపంచమంతా పాకింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వస్తున్న భారీ బడ్జెట్ సినిమాలలో పుష్ప ది రూల్ కూడా ఒకటి. ఈ సినిమా కోసం ఎంతోమంది భారీ అంచనాలతో ఎదురుచూస్తూ ఉన్నారు. ఈ సినిమాలో ఒక యంగ్ బ్యూటీ కనిపించనుంది.

ఆవిడ మరెవరో కాదు పావని కరణం. తిరువీర్ నటించిన పరేషాన్ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది పావని. అయితే ఇప్పుడు సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప ది రూల్ సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించింది పావని అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా లో శ్రీవల్లి కి చెల్లెలుగా, అల్లు అర్జున్కి మేనకోడలుగా కనిపించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో ఈమె పాత్ర చాలా కీలకంగా ఉండబోతుంది అని విశ్వసినీయ వర్గాల సమాచారం.

anushka rejected prabhas kalki movie offer?

rajinikanth and salman khan teaming up for atlee’s film?