in

bubbly beauty rashi khanna’s bad situation!

చూస్తుండగానే రాశి ఖన్నా తన కెరియర్ ను మొదలుపెట్టి పదేళ్లు దాటిపోయింది. 2003లో ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో తన కెరియర్ ను మొదలుపెట్టినప్పటికీ, ఆ తరువాత మాత్రం తెలుగు సినిమాలపైనే పూర్తి ఫోకస్ పెట్టింది. ‘జిల్’ .. ‘బెంగాల్ టైగర్’ .. ‘సుప్రీమ్’ వంటి సినిమాలతో తన ఖాతాలో కొన్ని హిట్లు వేసుకుంది. గ్లామర్ పరంగా, నటన పరంగా రాశి ఖన్నాకి వంకబెట్టవలసిన పనిలేదు. అయినా ఆరంభంలో ఆమె అంత స్పీడ్ చూపించలేదు. కానీ ఆ తరువాత గ్లామర్ విషయంలో డోస్ పెంచుతూ .. నటన పరంగా కూడా మరిన్ని మార్కులు కొట్టేస్తూ ముందుకు వెళ్లింది.

అయితే ఈ మధ్య ఆమె చేసిన ‘థ్యాంక్యూ’..’పక్కా కమర్షియల్’ సినిమాలు విజయానికి దూరంగానే ఉండిపోయాయి. అంతేకాదు కొత్తగా ఆమెను వెతుక్కుంటూ వచ్చే అవకాశాలు కూడా తగ్గుతూ వచ్చాయి. ఒక వైపున ఆమె వెబ్ సిరీస్ లకు కూడా గ్రీన్ సిగ్నల్స్ ఇస్తూనే ఉంది. అయినా సినిమాలు చేస్తే ఆ కిక్కు వేరు. అందువల్లనే సరైన హిట్ కోసం వెయిట్ చేస్తోంది. కొత్త హీరోయిన్స్ ను దాటుకుని ఆమె వరకూ ఛాన్సులు రావాలంటే కొంచెం కష్టమే. ఇంత గ్లామరున్న రాశి ఖన్నాకే అవస్థలు తప్పడం లేదంటే, ఆ తరువాత వరుసలో ఉన్నవారి పరిస్థితిని గురించి వేరే చెప్పాలా?

Hattrick combo joining hands, Gopichand with Ravi Teja!

naga chaithanya denies the rumors of ‘Bhool Bhulaiyaa 2’ remake!