బాలయ్యతో ‘అఖండ’ చిత్రంతో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తన తొలి ప్యాన్ ఇండియా చిత్రంగా పోతినేని రామ్ ప్రధాన పాత్రలో ‘స్కంద’ రూపొందించారు. ఈ సినిమా ఈనెల 28న ఐదు భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పుడు బోయపాటి తన తదుపరి చిత్రాన్ని తమిళ స్టార్ హీరో సూర్యతో చేయనున్నాడని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం గత కొంత కాలంగా చర్చలు జరుగుతున్నాయి. కోలీవుడ్ తాజా సమాచారం మేరకు బోయపాటి-సూర్య చిత్రం కన్ఫామ్ అయినట్టు తెలుస్తోంది..
వచ్చే ఏడాదిలో సినిమా ప్రారంభం అవనుంది. దాంతో, తెలుగు, తమిళ భాషల్లో సరికొత్త కాంబినేషన్ అభిమానులను అలరించనుంది. బోయపాటి శ్రీను మాస్ మసాలా చిత్రాలకు ఫేమస్ కాగా..సూర్య ఎలాంటి పాత్రలోనైనా మెప్పించగలడు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న సినిమా తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. బోయపాటి గతంలో పలు ఇంటర్వ్యూలలో సూర్యతో కలిసి పనిచేయాలనే తన కోరికను ప్రస్తావించారు. సూర్య ప్రస్తుతం ‘కంగువ’ అనే పాన్ ఇండియా చిత్రం చేస్తున్నాడు..!!