in

Boxing Legend Mike Tyson Teams Up With Vijay Deverakonda!

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్ లో యూత్ ఐకాన్ విజ‌య్ దేవ‌ర‌కొండ చేస్తున్న స్పోర్ట్స్ డ్రామా `లైగ‌ర్`. పాన్ – ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మిక్స్ డ్ మార్ష‌ల్ ఆర్టిస్ట్ గా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నాడు రౌడీ హీరో. విజ‌య్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్యా పాండే న‌టిస్తుండ‌గా.. త‌ల్లి పాత్ర‌లో నిన్న‌టి త‌రం అగ్ర క‌థానాయిక ర‌మ్య‌కృష్ణ ద‌ర్శ‌న‌మివ్వ‌నుంది. క‌రణ్ జోహార్, ఛార్మి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. `లైగ‌ర్`కి సంబంధించి ఓ ఆస‌క్తిక‌ర‌మైన వార్త వెలుగులోకి వ‌చ్చింది. అదేమిటంటే.. ఇందులో అమెరిక‌న్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్ అతిథి పాత్ర‌లో క‌నిపించ‌నున్నార‌ట‌. ఈ పాత్ర సినిమా హైలైట్స్ లో ఒక‌టిగా నిలుస్తుంద‌ని టాక్. మ‌రి.. ఈ ప్రచారంలో నిజ‌మెంతో తెలియాలంటే కొన్నాళ్ళు వేచిచూడాల్సిందే. కాగా, ఇప్ప‌టికే సింహ‌భాగం చిత్రీక‌ర‌ణ పూర్తిచేసుకున్న `లైగ‌ర్`కి క‌రోనా సెకండ్ వేవ్ కార‌ణంగా బ్రేక్ ప‌డింది. త్వ‌ర‌లోనే షూటింగ్ ని పునః ప్రారంభించ‌నున్నారు.

thrutilo bollywood ranga pravesham miss chesukunna balayya!

is Tagore Sequel On Cards? VV Vinayak clears rumors!