
నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేనిల కాంబినేషన్‌లో రాబోతున్న NBK 111 సినిమా గురించి వస్తున్న ఈ లేటెస్ట్ అప్‌డేట్ నందమూరి అభిమానుల్లో జోష్ నింపుతోంది. ఈ చిత్రంలో బాలయ్యతో బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫఖ్రీ జతకట్టనున్నట్టు సమాచారం. మరోవైపు, ‘వీరసింహారెడ్డి’ వంటి మాస్ హిట్టు తర్వాత బాలయ్య, గోపీచంద్ వీరిద్దరూ కలుస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి..
గతంలో గోపీచంద్ మలినేని సినిమాల్లోని ఐటెం సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకు తెలిసిందే. ఈసారి ఆ జోరును మరింత పెంచేందుకు బాలీవుడ్ నటి నర్గీస్ ఫఖ్రీని రంగంలోకి దించినట్లు తెలుస్తోంది. ‘రాక్ స్టార్’ సినిమాతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న నర్గీస్, బాలయ్య ఎనర్జీకి తోడైతే స్క్రీన్ పై గ్లామర్ అండ్ మాస్ విజువల్స్ అదిరిపోతాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు..!!
