in

Bollywood beauty bags Bellamkonda’s next!

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. మన దగ్గర సూపర్ హిట్ అయిన ‘ఛత్రపతి’ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇది బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కు హిందీ డెబ్యూ మూవీ కాగా వినాయక్ దర్శకత్వం వహిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా మూవీగా రూపొందిస్తున్నారు. పనిలో పనిగా తెలుగులో కూడా డబ్ చేస్తారట. ఇదిలా ఉండగా.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన హిందీ ‘ఛత్రపతి’ లో నటించడానికి అక్కడి స్టార్ హీరోయిన్లు ఇంట్రెస్ట్ చూపించడం లేదంటూ మొన్నటి వరకు కథనాలు వినిపించాయి. స్టార్ హీరోయిన్స్ అయినా కియారా అద్వానీ, అలియా భట్, శ్రద్దా కపూర్ వంటి వారిని నిర్మాతలు సంప్రదించారు కానీ వాళ్ళు ఈ ఆఫర్ ను రిజెక్ట్ చేశారు.

ఓ దశలో దిశా పటాని ఫిక్స్ అన్నారు. కానీ డేట్స్ అడ్జస్ట్ చేయలేక ఆమె కూడా తప్పుకుందని వినికిడి. ఫైనల్ గా నుష్రత్ బరుచా అనే అమ్మాయిని హీరోయిన్ గా ఫిక్స్ చేశారట. ‘సోను కె టిటు కి స్వీటీ’ ‘చలాంగ్’ వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతున్న ‘రామ్ సేతు’ అనే మూవీలో కూడా హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పుడిప్పుడే స్టార్ గా ఎదుగుతుంది ఈమె. మొత్తానికి స్టార్ హీరోయిన్లు నొ చెప్పడంతో బెల్లంకొండకి ఈమెనే బిగ్ ఛాయిస్ అయ్యింది. తొందరలోనే ఈమెను కన్ఫర్మ్ చేస్తూ అధికారిక ప్రకటన కూడా రానుందని వినికిడి..

busty beauty Anveshi Jain latest hot photoshoot!

kangana: no Bollywood celebrity deserves to come to my home