in

nikki tamboli: i was not only tortured but also humiliated

నిక్కీ తంబోలి.. తెలుగులో 2019లో విడుదలైన ‘చీకటి గదిలో చితక్కొట్టుడు’ సినిమాతో యూత్‌కు దగ్గరైన ఈ బ్యూటీ.. ఆ తర్వాత ‘తిప్పరా మీసం’ సినిమాల్లో నటించింది. తమిళంలో ‘కాంచన 3’లోనూ ఓ పాత్రలో కనిపించింది. ఇదివరకు నిక్కీ టీవీ నటిగా రాణించింది. అంతేకాదు, సల్మాన్ ఖాన్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘బిగ్ బాస్-14’లోనూ పాల్గొంది. ఆ సీజన్‌లో రుబీనా దిలైక్ విజేత కాగా, గాయకుడు రాహుల్ రన్నరప్‌గా నిలిచాడు. నిక్కీ రెండో రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

తాజా నిక్కీ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఓ దక్షిణాది దర్శకుడు తనతో చెడుగా ప్రవర్తించాడని తెలిపింది. తన జీవితంలో అదో చెత్త అనుభవం అని పేర్కొంది. అతడి ప్రవర్తన వల్ల తాను ఇంటికి వచ్చిన తర్వాత ఏడ్చేశానని తెలిసింది. అయితే, ఆ దర్శకుడి పేరు చెప్పేందుకు మాత్రం నిక్కీ నిరాకరించింది. ‘‘నేను దక్షిణాదిలో చేసిన ఓ సినిమా బాగా గుర్తుంది. విదేశంలో షూటింగ్ జరుగుతున్నప్పునడు ఓ దర్శకుడు నాతో చాలా చెడుగా ప్రవర్తించాడు..

అతను నన్ను సెట్‌లో సరిగ్గా ట్రీట్ చేయలేదు. నాతోపాటు ఉండే డ్యాన్సర్లను మెచ్చుకొనేవాడు. నన్ను మాత్రం ‘ఎక్కడెక్కడి నుంచో వచ్చేస్తారు’’ అని అనేవాడు’’ అని తెలిపింది. నాకు మొదట్లో ఆ భాష రాదు కాబట్టి.. నేను ఏమీ మాట్లాడలేకపోయాను. కానీ, ఇంటికి వచ్చిన తర్వాత చాలా ఏడ్చాను. అమ్మా, నాన్నకు కూడా ఈ విషయం తెలుసు’’ అని తెలిపింది. మరి, ఆమె నటించిన మూడు చిత్రాల్లో ఏ దర్శకుడు ఆమెతో అలా ప్రవర్తించాడనే చర్చ నెలకొంది.

Indravathi Chouhan to Receive Behindwoods Gold Medal for ‘Oo Antava’ So ng!

busty beauty Anveshi Jain latest hot photoshoot!