in

Bobby Deol is ram charan’s villain?

యానిమల్’ సినిమాలో అబ్రార్ పాత్రతో సంచలనం రేపిన బాబీ డియోల్‌ను చరణ్ సినిమాలో విలన్ పాత్రకు చూస్తున్నారట. ఆయనతో ప్రస్తుతం సంప్రదింపులు జరుగుతున్నాయి. బాబీ ఆల్రెడీ బాలయ్య సినిమాలో విలన్ పాత్ర చేస్తున్నాడు. ‘యానిమల్’ రిలీజ్ కాకముందే అతనీ కమిట్మెంట్ ఇచ్చాడు. ఆ సినిమా రిలీజ్ తర్వాత బాబీ డిమాండ్ బాగా పెరిగిపోయింది.

బాలీవుడ్ నుంచే కాక సౌత్ నుంచి కూడా ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. చరణ్-బుచ్చిబాబు సినిమా రేంజ్ దృష్ట్యా అందులో విలన్ పాత్ర చేయడానికి బాబీ కచ్చితంగా అంగీకరిస్తాడనే అనుకుంటున్నారు. ఉత్తరాంద్ర నేపథ్యంలో ఈ సినిమాలో చరణ్ స్పోర్ట్స్ కోచ్ పాత్ర చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో కొన్ని పాత్రల కోసం ఉత్తరాంధ్రలో ఆడిషన్స్ కూడా చేసిన సంగతి తెలిసిందే..!!

interesting update on trivikram srinivas and allu arjun film!

anchor pradeep dating a tollywood heroine?