నిన్న హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన సిరి తల్లి శ్రీదేవి.. వచ్చీ రాగానే కూతురుకు చివాట్లు పెట్టింది. ‘షణ్ముఖ్‌ను హాగ్ చేసుకోవడం నచ్చలేదని’ ముక్కుసూటిగా చెప్పింది. దగ్గరవ్వడం మంచిదే గానీ హద్దులు దాటి హగ్గులు చేసుకోవడం నచ్చడం లేదంటూ శ్రీదేవి చెప్పగా.. టాపిక్ డైవర్ట్ చేస్తూ తల్లిని సిరి పక్కకి తీసుకెళ్తుంది. ‘హాగ్ చేసుకోవడం నచ్చలేదంటే నన్ను పక్కకి పిలిచి పర్సనల్‌గా చెప్పొచ్చుగా.. ఇలా చెబితే వాళ్లు ఏమనుకుంటారు’ అని సిరి తల్లిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘తల్లిగా ఈ విషయాలు చెప్పడం నా బాధ్యత. అందుకే చెప్పాను’ అని శ్రీదేవి చెబుతుంది.
ఆ తర్వాత తన కష్టాలు చెప్పుకుని బాధపడిన ఆమె.. కూతురును ఎలాగైనా కప్పు పట్టుకుని ఇంటికి రమ్మంటుంది. అనంతరం శ్రీదేవి హౌస్ మేట్స్ అందరికీ వీడ్కోలు చెప్పి వెళ్తుంది. ఆమె వెళ్లిపోయాక సిరి వచ్చి షణ్ముఖ్‌ను హాగ్ చేసుకుని ఏడవగా.. షణ్నూ మాత్రం ఆమెను మనసారా హత్తుకుని ఓదార్చలేకపోయాడు. నా ఆటను కూడా పక్కనబెట్టి సిరికి ఇంత సపోర్ట్ ఇస్తుంటే.. ఆమె తల్లితో మాటలు పడాల్సి వచ్చిందని బాధపడ్డాడు. హగ్గులు నచ్చడం లేదని ఆమె తల్లి చెప్పినప్పుడు సిరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని.. హౌస్‌లో ఉండేందుకు తాను అర్హుడిని కాదని అనుకుంటూ కుమిలిపోయాడు.