2007లో తన యోగా టీచర్ భరత్ ఠాకూర్‌ను పెళ్లి చేసుకున్నారు భూమిక . 2014లో వీరికి ఒక బాబు పుట్టారు. అయితే సోషల్ మీడియాలో భర్తతో కలిసి దిగిన ఫొటోలు పెట్టనందుకు, బయట పబ్లిక్‌లో ఒంటరిగా కనిపించినంత మాత్రానికే ఆమె విడాకులు తీసుకుందంటూ పుకార్లు మొదలయ్యాయి. తాజాగా ఈ వార్తలకు భూమిక చెక్ పట్టారు. పెళ్లి రోజు సందర్భంగా భర్తతో కలిసి దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు.
“వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతోనే మొదలవుతుంది.. ఆ ఒక్క అడుగు ప్రేమే.., ఒకరి గురించి ఒకరం మరింత లోతుగా అర్థం చేసుకోవడమే. మన గురించి మనం ఇంకా తెలుసుకోవడమే. మనల్ని, మన జంట ప్రయాణాన్ని ఆ దేవుడు ఆశీర్వదించాలి. నిన్ను, నీ అంకితభావాన్ని, కష్టపడే మనస్తత్వాన్ని చూస్తుంటే గర్వంగా ఉంది” అని రాసుకొచ్చారు. ఈ పోస్టుతోనైనా ఆమె విడాకులు తీసుకుంటుందనే రూమర్లకు స్వస్తి పలకాలని ఆశిద్దాం..