in

BANDLA GANESH TWEET ON HIS ARREST !

ఇటీవల అనుచరులతో కలిసి బండ్ల గణేష్ తనను బెదిరించారని పోలీసులకు పీవీపీ ఫిర్యాదు చేశారు. దాంతో బుధవారం సాయంత్రం బండ్ల గణేష్‌ను జూబ్లిహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అదే సమయంలో ముంబైకి చెందిన ఓ ఫైనాన్షియర్‌ను మోసం చేసిన కేసులో కూడా గణేష్‌ను అరెస్ట్ చేసినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై నిర్మాత, నటుడు బండ్ల గణేష్ స్పందించారు. `నన్ను ఏ పోలీసులు అరెస్ట్ చేయలేదు విచారణ కోసం పిలవడం జరిగింది చట్టం పై గౌరవంతో వాళ్లు సహకరిస్తున్నారు నన్ను అరెస్టు చేస్తే నేను మీకు తెలియజేస్తాను మీ బండ్ల గణేష్` అంటూ ట్వీట్ చేశాడు.

అయితే గణేష్‌ తనను అరెస్ట్ చేయలదని చెపుతున్నా సోషల్ మీడియాలో సర్క్యూలేట్‌ అవుతున్న వీడియోలు చూస్తే మాత్రం అలా అనిపించటం లేదు. పోలీసులు బలవంతంగా బండ్ల గణేష్‌ను తీసుకెళుతున్నట్టుగానే అనిపిస్తుంది. అంతేకాదు ఇంకా బండ్ల గణేష్‌ పోలీసు కస్టడీలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

SHAKILA CHEMPA PAGALAGOTTINA SILK SMITHA!

top 10 forgotten heroes of Tollywood!