బోల్డ్ బ్యూటీ రాధికా ఈ బోల్డ్ బ్యూటీ బాలయ్య హీరోగా నటించిన ‘లెజెండ్’తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. ఆ తరువాత ఆమె తెలుగు, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో నటించారు. తాజాగా రాధికా ఆప్టే మెగా ఫోన్ పట్టారు. రాధికా హార్రర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ ‘స్లీప్ వాకర్స్’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘స్లీప్వాకర్స్’లో షహానా గోస్వామి, గుల్షన్ దేవయ్య ప్రధాన పాత్రల్లో నటించారు. పామ్స్ స్ప్రింగ్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్లో రాధికా తాను దర్శకత్వం వహించిన ‘ది స్లీప్వాకర్స్’ ట్రైలర్ను విడుదల చేసింది.
ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాలొన్న రాధికా తాను దర్శకురాలిగా మారడం గురించి మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ ‘నేను ఎప్పుడూ దర్శకురాలిగా మారాలనుకోలేదు. అసలు అలాంటి ఆలోచనే లేదు. నాకు ఆసక్తికరంగా అన్పించింది రాయాలనుకున్నాను. నేను హనీ ట్రెహాన్, అభిషేక్ చౌబేలకు కథను చెప్పినప్పుడు వారు దాన్ని చేయాలనుకున్నారు. షూటింగ్ కు, ప్రిపేరేషన్ కు 10 రోజులు ఉందనగా కథ రాయడం అయిపోయింది. కథ రాయడం అయిపోయాక అందులో నేను నటించాలని అనుకోలేదు. కానీ దర్శకత్వం వహించాలనుకున్నా. దర్శకత్వం చేయడం నాకు బాగా నచ్చింది’ అంటూ చెప్పుకొచ్చింది రాధికా.