in

balayya planning sequels with Prasanth Varma!

బాలయ్య వారసుడు మోక్షజ్ఞ ఆదిత్య 369 సీక్వెల్ తో ఎంట్రీ ఇస్తాడని ప్రచారం జరిగింది. కానీ కుదరలేదు. ఇపుడు మళ్ళీ ఈ సీక్వెల్స్ గూర్చి చర్చ జరుగుతోంది. ఆదిత్య 369 తెలుగులో ఫస్ట్ సైన్స్ ఫిక్షన్ మూవీగా నిలిచింది. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 1991లో వచ్చిన ఈ మూవీ కమర్షియల్ గా కూడా మంచి వసూళ్లు సాధించింది. ఈ మూవీ తరవాత కూడా ఇలాంటి కాన్సెప్ట్ లు రాలేదు. అందుకే బాలయ్య ఇపుడు ఆదిత్య 369 కి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారు..

‘ఆదిత్య 999’ టైటిల్ తో మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ కెప్టెన్ గా తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారని ఫిలిం నగర్ టాక్.
ఆదిత్య 369 తో పాటు ‘భైరవద్వీపం’ సీక్వెల్ బాధ్యతలు కూడా బాలయ్య ప్రశాంత్ వర్మకి ఇస్తున్నారని సమాచారం. ఈ మూవీలో  కూడా మోక్షజ్ఞ హీరో గా నటిస్తాడని తెలుస్తోంది. ప్రజంట్ మోక్షజ్ఞ తో ప్రశాంత్ చేస్తున్న మూవీ సక్సెస్ అయితే ఈ సీక్వెల్స్ పట్టాలెక్కించి యోచన చేస్తున్నారంట బాలయ్య. .!!

Shankar joining forces with surya and vikram?

nabha natesh keeps all hopes on her re entry film!