in

balayya as ‘bhagavanth kesari’!

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజుకు నలభై ఎనిమిది గంటల ముందే అభిమానులకు కానుకల పర్వం మొదలైపోయింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్బి కె 108 టైటిల్ ని ఫస్ట్ లుక్ తో పాటు అధికారికంగా విడుదల చేశారు. భగవంత్ కేసరి పేరుతో ఐ డోంట్ కేర్ అనే ట్యాగ్ బాలయ్యకు పర్ఫెక్ట్ గా సూటయ్యేలా ఉంది. కాస్త గుబురుగా ఉన్న తెల్ల గెడ్డంతో పెద్దరికం తొణికిసలాడే స్టయిలిష్ అవుట్ ఫిట్ తో ఫ్యాన్స్ నే కాదు సగటు ప్రేక్షకులను కూడా ఆకట్టుకునేలా ఉంది. అందరూ ఊహించినట్టు కాకుండా సైడ్ లుక్ తో ఆయుధం నేలలో దిగబడే స్టిల్ తో సర్ప్రైజ్ చేశారు

టైటిల్ ని కాస్త జాగ్రత్తగా డీ కోడ్ చేస్తే మూడు సింహాల చిహ్నం ఉంది. అంటే బాలయ్య పాత్ర పోలీస్ ఆఫీసర్ గా కనిపించే క్లూ ఇచ్చారు. అయితే గెడ్డంని బట్టి రిటైర్ అయ్యాక జరిగే కథగా మొదలుపెట్టొచ్చు. ఫన్ ఎంటర్ టైనర్స్ ఇవ్వడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న అనిల్ రావిపూడి మొదటిసారి బాలకృష్ణ లాంటి మాస్ హీరోతో చేయడం పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది. హై వోల్టేజ్ యాక్షన్ తో పాటు తన మార్కు పటాస్ తరహా కామెడీని ఇందులో జొప్పిస్తారని టాక్. అఖండ, వీరసింహారెడ్డి తర్వాత తమన్ ముచ్చటగా మూడోసారి హ్యాట్రిక్ ఆల్బమ్ కి రెడీ అవుతున్నాడు.!!

hot beauty radhika apte re entry into south cinema!

ANDHRA TIGER CHANGED THE FUTURE OF TWO LEGENDS!