in

Balakrishna’s son Mokshagna’s debut film confirmed?

నందమూరి వారసుడి ఎంట్రీ కోసం ఎంతగానో ఎదురు చూస్తున అభిమానుల కి మోక్షజ్ఞ ఎంట్రీకి రంగం సిద్ధమయ్యిందని ఇన్ సైడ్ టాక్. హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందబోయే ఈ ఫాంటసీ సోషల్ డ్రామాగ పక్కా స్క్రిప్ట్ తో తెరకెక్కించబోతున్నట్టు వినికిడి. మూవీ మేకర్స్ అధికారిక ప్రకటన చేయలేదు కాబట్టి కచ్చితంగా చెప్పలేకపోతునం కానీ మొత్తానికి తెరవెనుక పనులు జరుగుతున్న మాట వాస్తవం. మోక్షజ్ఞకు ఫోటో షూట్ చేశారు. శాంపిల్ లుక్స్ ని సోషల్ మీడియాలో వదిలాక మంచి రెస్పాన్స్ వచ్చింది.మొత్తానికి మంచి కాంబో సెట్ అవుతుందని చెప్పాలి.

అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ తర్వాత కొత్త జనరేషన్ నుంచి వస్తున్న హీరోగా మోక్షజ్ఞ మీద మాములు అంచనాలు ఉండబోవడం లేదు. భారీ బడ్జెట్ తో తెరకెక్కబోయే ఈ సినిమాని ప్యాన్ ఇండియా రేంజులో తీస్తారట. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం మేరకు సెప్టెంబర్ నెలలో సినిమా కార్యక్రమాలు ప్రారంభిస్తారని తెలిసింది. నందమూరి అభిమానులు ఈ కాంబోలో ఇండస్ట్రీ హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారని సమాచారం..!!

Bobby Deol To Play Villain Role In ‘Devara’.

Harish Shankar to work with ismart hero ram!