బాలకృష్ణ ది లయన్!
ఎటువంటి పాత్రలోనైనా ఇమ్మడిపోయి నటించే బాలయ్య.. ఇప్పటివరకు సింహం పేరు కలిసి వచ్చేలా ఏకంగా తొమ్మిది సినిమాలలో నటించాడు. ఆ సినిమాలు ఏంటో ఒకసారి చూద్దాం. తండ్రి ఎన్టీఆర్ తో కలిసి బాలకృష్ణ నటించిన మూవీ సింహం నవ్వింది. 1983లో తెరకెక్కిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ సినిమా తర్వాత సింహం పేరుతో వచ్చిన సినిమాలలో 1994 లో తెరకెక్కిన బొబ్బిలి సింహం సినిమా ఒకటి. ఈ సినిమాలో రోజా, మీనా హీరోయిన్లుగా నటించారు..
సింహం పేరు కలిసి వచ్చేలా బాలయ్య సినిమా టైటిల్స్!
కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాకు అప్పట్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. తర్వాత 1999 లో వచ్చిన సమరసింహారెడ్డి కూడా ఈ సినిమాలలో ఒకటి. ఇందులో అంజలి జవేరి, సిమ్రాన్, సంఘవి కీలక పాత్రలో నటించారు. బి గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. అలాగే 2001లో నరసింహనాయుడు, 2002లో సీమ సింహం, 2004లో లక్ష్మీనరసింహ, 2010లో సింహా, 2018 లో జయసింహ, 2023లో వీరసింహారెడ్డి సినిమాలు సింహ పేరు కలిసొచ్చేలా తెరకెక్కాయి..!!