నందమూరి బాలకృష్ణ – యాక్షన్ సినిమాల దర్శకుడు బి. గోపాల్ కాంబినేషన్‌కు ఉండే క్రేజ్ వేరు. వీరిద్దరి కాంబినేషన్లో ఐదు సినిమాలు వస్తే రెండు సూపర్ డూపర్ హిట్. రెండు ఇండస్ట్రీ హిట్లు. ఇక 1999 సంక్రాంతి కానుకగా వచ్చిన సమరసింహారెడ్డి సినిమా అప్పటి వరకు తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులను తిరగరాసింది. ఈ సినిమా కథా రచయిత విజయేంద్రప్రసాద్ ముందుగా చెప్పిన 30 కథలు దర్శకుడు గోపాల్‌కు నచ్చలేదు. అయితే విజయేంద్రప్రసాద్ దగ్గర అసిస్టెంట్‌గా పనిచేసే రత్నం సలహా మేరకు తమిళ సిందూరపువ్వు తరహా స్టోరీకి రాయలసీమ ప్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌గా జోడించారు.
ఈ కథ గోపాల్‌కు నచ్చింది. అయితే గోపాల్ కూడా నాకు హిందీలో వచ్చిన దుష్మన్ సినిమా స్టైల్ కథ కావాలని విజయేంద్రప్రసాద్‌కు చెప్పడంతో ఇవన్నీ ఆలోచించి ఏడు రోజుల్లోనే విజయేంద్రప్రసాద్ అదిరిపోయే కథ రాసుకున్నారు. ఇది గోపాల్‌కు బాగా నచ్చింది. ఈ సినిమాకు బాలయ్యే హీరో అయితే కరెక్ట్ అని నిర్ణయం తీసుకున్నారు. 1999, జనవరి 13న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్రలో ఓ ట్రెండ్ సెట్ చేసింది. అప్పట్లో లవ్ ట్రాక్ లేకుండా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన మొదటి సినిమా ఇదే కావడం మరో రికార్డు.
ఈ సినిమాలో ముందుగా రాశీ – సంఘవి – అంజలా జవేరిలను హీరోయిన్‌గా అనుకున్నారు. అయితే సీతాకోక చిలుక సీన్‌కు రాశీ ఒప్పుకోలేదు. దీంతో సిమ్రాన్‌ను హీరోయిన్‌గా ఆ ప్లేస్‌లో తీసుకున్నారు. ఇక ఈ సినిమాకు ముందుగా సమరసింహం అన్న టైటిల్ అనుకున్నారు. అయితే పరుచూరి గోపాలకృష్ణ సలహా మేరకు సమరసింహారెడ్డి అని టైటిల్ మార్చారు. రు. 6 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఏకంగా 16 కోట్లు కొల్లగొట్టింది. 122 కేంద్రాల్లో 50 రోజులు – 73 కేంద్రాల్లో 100 రోజులు – 29 కేంద్రాల్లో 175 రోజులు – 3 కేంద్రాల్లో 227 రోజులు ఆడింది. ఈ సినిమాకు ఉత్తమ దర్శకుడిగా బి. గోపాల్ ఫిలిం ఫేర్ అవార్డు అందుకున్నారు.